కాలిఫోర్నియా: యాపిల్ సంస్థ తన కొత్త ఉత్పత్తులను ఈనెల 20వ తేదీన ఆవిష్కరించనున్నది. ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ మినీ, ఎయిర్‌పాడ్స్‌కు చెందిన అప్‌డెట్స్‌ను యాపిల్ రిలీజ్ చేయనున్నది. స్ప్రింగ్ లోడెడ్ ట్యాగ్‌లైన్‌తో ఈనెల 20వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యాపిల్‌కు చెందిన సిరి .. యూజర్లతో మాట్లాడుతూ ఆ తేదీని ప్రకటించింది. ఈ ఏడాది ఐప్యాడ్ లైనప్‌ను పూర్తిగా అప్డేట్ చేయాలని యాపిల్ భావిస్తున్నది. దానిలో భాగంగా ఐప్యాడ్ ప్రోను.. సూపర్ బ్రైట్ ఎల్ఈడీ డిప్లేతో రిలీజ్ చేయనున్నారు. రీ డిజైన్ చేసిన మినీ ఐప్యాడ్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. నెక్ట్స్ జనరేషన్‌కు చెందిన ఎయిర్‌పాడ్స్ 3 డిజైన్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు. మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్‌లను కొత్త లుక్‌లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇటీవల యాపిల్ సంస్థ తన పవర్ఫుల్ కంప్యూటర్ ఐమ్యాక్ ప్రో లైన్‌ను నిలిపివేసింది. ఇక నుంచి ఆ సంస్థ హోమ్‌పాడ్ మినీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.