శోభాయమానం.. నారసింహ ఆలయం

కృష్ణ శిలలతో అత్యద్భుత నిర్మాణాలు..భావితరాలకు గుర్తుండిపోయేలా అన్ని హంగులతో యాదాద్రి గిరులు నయా శోభను సంతరిం చుకున్నాయి. హరిహరులకు నెలవైన దివ్యక్షేత్రంలో ఓ వైపు ప్రధానాలయ పనులు తుదిదశకు చేరుకుంటుండగా, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానాలయానికి ఇత్తడి కిటికీలు అమర్చే పనులు జెట్‌స్పీడ్‌లో సాగుతున్నాయి. స్వామివారి ప్రధానా లయం మాదిరి కృష్ణశిలలతో శివాలయాన్ని నిర్మించగా, వాటికి మరింత అందాన్నిచ్చే స్టోన్ కలర్ పనులను సోమవారం వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత ప్రారంభించారు.
యాదాద్రి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం నిర్మాణం పనులతో పాటు శివాలయంలో తుది మెరుగుల పనులు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు శిల్పులు, ఉప స్థపతులు, ఉన్నతాధికారులు అహరహరం శ్రమిస్తున్నారు. యాదాద్రి కొండపై ప్రధానాలయాన్ని 4. 25 ఎకరాల్లో నిర్మాణం చేయగా శివాలయాన్ని 1. 25 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారు. వైటీడీఏ అధికారులు శివాలయంలో గల ఉపాలయాలు కూడా కృష్ణశిలలతో ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఈవో ఎన్. గీత సోమవారం శివాలయంలోని నిర్మాణాలకు స్టోన్ కలర్ వేసే పనులకు ప్రత్యేకపూజలు జరిపి ప్రారంభించారు. యాదాద్రి ప్రధానాలయం మాదిరిగానే కృష్ణశిలలతో శివాలయాన్ని నిర్మాణం చేశారు. మరింత శోభాయమానంగా కనిపించేందుకు వాటికి స్టోన్ కలర్ వేస్తున్నారు. హరిహరులకు నెలవు అయిన యాదాద్రిలో నిర్మాణం పనులు తుది దశకు చేరుకుంటుండటంతో ఎంతో ఆకర్ణణీయంగా కనిపిస్తున్నాయి.
ఒక వైపు ప్రధానాలయ తుది దశ పనులు... మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టిన అధికారులు ఇప్పటికే 98 శాతం పనులు పూర్తి చేసుకున్న శివాలయాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. శివాలయంలోని ముఖ మం డపం, ఉప ఆలయాలు, శివాలయ బ్రహ్మోత్సవ మండపములకు స్టోన్ కలర్ వేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన స్థపతి డాక్టర ఆనందాచార్యుల వేలు నృతృత్వంలోని ఉప స్థపతులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉపాలయాల్లో ప్రతిష్టించనున్న విగ్రహాలను ఆలయ ఆవరణలోనే ఉంచి భద్రతాచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రధానాలయానికి ఇత్తడి కిటికీలు
యాదాద్రి ప్రధానాలయానికి ఇత్తడి కిటికీలను అమర్చే పనులు ఊపందుకున్నాయి. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా రాజసం ప్రదర్శిస్తున్న ఐదు పంచతల రాజగోపురాలు, పశ్చిమంలోని సప్త తల మహాగోపురాలకు కూడా ఇత్తడి కిటికీలు అమరుస్తున్నారు.మహారాజగోపురాలకు ఇత్తడితో తయారు చేసిన శంఖు, చక్ర, నామాలను కూడా అలంకరణ కోసం పెట్టనున్నారు. రాజగోపురాలనున నిర్మాణం చేసే సమయంలోనే వదిలిన స్థలాల్లో కిటికీలను అమరుస్తున్నారు.
పనులు మరింత వేగిరం
సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో 15 రోజుల నుంచి పనులలో వేగం పెరిగింది. జూన్ రెండో వారంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావులతో ప్రత్యేకంగా సమావేశమై చేయాల్సిన పనులను దిశా నిర్ధేశం చేశారు. ఆ మేరకే అధికారులు క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఎన్సీలు గణపతిరెడ్డి, కె. రవీందర్రావు, ఈవో ఎన్. గీత, ఆర్కిటెక్టు ఆనందసాయి, పలువురు టెక్నికల్ కమిటీ సభ్యులు యాదాద్రిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొదటగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో సుగంధం వెదజల్లే మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
- ఖిల్లా మైసమ్మ జాతర ప్రారంభం
- స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంక్ సాధిద్దాం
- కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- వామన్‌రావు హత్య కేసు సీబీఐకి ఇవ్వండి
- మహిళా దినోత్సవం నిర్వహణకు కమిటీ
- ఎన్ఏఈబీ సభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డి
- మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
- వేణుగోపాల స్వామి ఆలయంలో కోటి కుంకుమార్చన