శనివారం 05 డిసెంబర్ 2020
Yadadri - Jul 06, 2020 , 02:06:55

రైతుకు భ‌రోసా

రైతుకు భ‌రోసా

  • కర్షకులతో  అడ్డగూడూరు సింగిల్‌ విండో కార్యాలయం కళకళ
  • అందుబాటులో ఎరువులు 

అడ్డగూడూరు: వ్యవసాయరంగానికి  ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నది. వర్షాలు కురుస్తుండటంతో ఎరువులు, విత్తనాలు తీసుకువెళ్లేందుకు మండలకేంద్రంలో ఉన్న సింగిల్‌ విండో కార్యాలయానికి  రైతులు బారులు తీరుతున్నారు. మండలంలోని 17 గ్రామాలకు ఒక్కటే సింగిల్‌ విండో కార్యాలయం ఉంది. దీంతో  రైతులు  వచ్చి ట్రాక్టర్లలో ఎరువుల బస్తాలను తీసుకొని వెళ్తున్నారు. అంతేకాకుండా పత్తి, వరి, కంది విత్తనాలు సైతం విక్రయిస్తున్నారు. గతంలో రైతులు ఎరువుల కోసం నానా తిప్పలు పడేవారు. రైతులు ఇబ్బందులు పడకుండాకేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కూడాప్రభుత్వం కొనుగోలు చేసింది. అర్హత కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.30 వేల రుణం ఇచ్చారు.

 సింగిల్‌ విండో అభివృద్ధికి కృషి  

సింగిల్‌ విండో అభివృద్ధికి మరింత కృషి చేస్తా. ఒకప్పుడు  ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ దుకాణాల్లో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేవారు.ఇప్పుడు సింగిల్‌ విండో కార్యాలయంలోనే కొనుగోలు చేయడం శుభపరిమాణం.రైతులకు కావాల్సిన ఎరువులు పుష్కలంగా ఉన్నాయి.ప్రతి రైతు సింగిల్‌ విండో కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.రైతులకు రూ.కోటి వరకు రుణాలు ఇచ్చాం.

  -వెంకటేశ్వర్లు,సింగిల్‌ విండో చైర్మన్‌,అడ్డగూడూరు