యాదాద్రిలో భక్తుల సందడి

- రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
- కొండపైన ఈశాన్య భాగంలో కొనసాగుతున్న ఫ్లోరింగ్ పనులు
యాదాద్రి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. కొవిడ్-19 నేపథ్యంలో అధికారులు కఠినమైన నిబంధనలు పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భౌతికదూరం పాటించాలని కోరుతూ దేవస్థానం మైక్ ద్వారా గంటకోసారి అనౌన్స్మెంట్ చేయిస్తున్నారు. ఆలయ ఈవో ఎన్. గీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆల్వారును కొలుస్తూ హోమం జరిపారు. రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవం కోసం ఆన్లైన్లో రుసుం చెల్లించిన భక్తుల గోత్రనామాలతో పూజలు చేశారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా శ్రీవారి కైంకర్యాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు.
రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
కొండపైన గల పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ శివాలయం ప్రధానార్చకుడు గౌరీబట్ల నర్సింహరాముల శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు కుంకుమార్చన జరిపారు. ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడిశివకుమార్, సూపరింటెండెంట్లు వేముల వెంకటేశ్, ఎస్. వెంకటేశ్వర్రావు, సార నర్సింహ, బాలాజీ, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
వాహన పూజలు ప్రారంభం
లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి నిలిచిపోయిన వాహన పూజలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇంతకాలం కొవిడ్-19 నిబంధనలు ఉండటంతో పూజలు నిలిపివేసిన అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ జారీ చేసిన ఆదేశాల మేరకు తిరిగి పూజలు ప్రారంభించారు. కొండ కింద గతంలో జరిగిన వాహనపూజల షెడ్డులోనే పూజలు కొనసాగిస్తున్నారు.
కొండపైన కొనసాగుతున్న ఫ్లోరింగ్ పనులు
యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ఉప స్థపతులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.. ఇటీవల వర్షాలకు దక్షిణం వైపున కుంగడంతో జాగ్రత్తలు తీసుకుని పనులు నాణ్యతగా ఉండేలా చొరవ తీసుకుంటున్నారు. ఫ్లోరింగ్ అడుగు భాగం రెండు మూడు రోజులు గట్టిపడిన తర్వాతనే కృష్ణశిలలను అమరుస్తున్నారు.
తాజావార్తలు
- గొర్రెలకు హాస్టళ్లు.. ఎక్కడో తెలుసా?
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం