శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jul 06, 2020 , 01:45:19

రైతుల సమస్యల పరిష్కారానికే రైతు వేదికలు

రైతుల సమస్యల పరిష్కారానికే రైతు వేదికలు

  • ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 

రామన్నపేట : రైతుల సమస్యలను పరిష్కరించడానికే రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో టీటీడీ కల్యాణ మండపం సమీపంలో వెల్లంకి గ్రామంలో రైతు వేదికల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామన్నపేట, వెల్లంకి, ఇంద్రపాలనగరం, మునిపంపుల గ్రామాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22లక్షల చొప్పున మండలంలో నాలుగు వేదికలకు రూ.88లక్షల నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ వేదికల ద్వారా ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి విస్తరణ అధికారిని నియమించడం జరుగుతుందని చెప్పారు. రైతు వేదికల ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అమలు చేయడంతో పాటు సాగులో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు పున్న జగన్మోహన్‌, నీల దయాకర్‌, ఎడ్ల మహేందర్‌రెడి,్డ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, అంతటి రమేశ్‌, గోదాసు పృథ్వీరాజ్‌, ఎండీ రేహాన్‌, రాపోలు బలరాం, యాదయ్య, అప్పం లక్ష్మీనర్సు, పోతరాజు సాయికుమార్‌, ఎండీ అమీర్‌, గొరిగే నర్సింహ, సాల్వేరు లింగం, జాడ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.   

నేడు మంత్రి జగదీశ్‌రెడ్డి రాక.. 

రామన్నపేట మండలంలోని వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ఈనెల 6న సోమవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరు కానున్నట్లు నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రామన్నపేట, వెల్లంకి గ్రామాల్లో రైతు వేదికల భవనాల శంకుస్థాపనకు, సిరిపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. 

VIDEOS

logo