శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 06, 2020 , 01:41:30

రైతులకు ఇబ్బందులు రానివ్వం

రైతులకు ఇబ్బందులు రానివ్వం

  • రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ జైపాల్‌రెడ్డి

భువనగిరి : బునాదిగాని కాల్వ ఆయకట్టు కింద ఉన్న రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి అన్నారు. బునాదిగాని కాల్వ మరమ్మతు పనులు పూర్తయిన సందర్భంగా ఆదివారం మండలంలోని మక్తఅనంతారం గ్రామంలో ఐబీ అధికారులతో కలిసి నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాల్వ మరమ్మతు పనులు పూర్తిస్థాయిలో జరిగాయని, దీంతో బీబీనగర్‌ మండలం నుంచి భువనగిరి మండలంలోని అనాజీపురం వరకు కాల్వనీరు నిరాటంకంగా ప్రవహిస్తాయన్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐబీ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo