శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 01, 2020 , 23:47:42

ఆలేరు పట్టణంలో మహిళకు కరోనా పాజిటివ్‌

ఆలేరు పట్టణంలో మహిళకు కరోనా పాజిటివ్‌

ఆలేరు టౌన్‌ : పట్టణానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండలంలోని శారాజీపేట పీహెచ్‌సీ వైద్యాధికారి జ్యోతిబాయి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొలనుపాక రోడ్డులో నివాసంలో ఉంటున్న మహిళ పది రోజుల కిందట హైదరాబాద్‌లోని తమ బంధువుల వద్ద జరిగిన ఓ శుభకార్యానికి హాజరై వచ్చిందన్నారు. దీంతో వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆమె స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేయించుకున్నదని తెలిపారు. అయితే ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. వెంటనే ఆమెను గాంధీ దవాఖానకు తరలించామన్నారు. ఆమెతో పాటు ఉన్న ఐదుగురు బంధువులు, కుటుంబ సభ్యులను బీబీనగర్‌ ఎయిమ్స్‌కు తరలించి హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆమె నివాసం ఉంటున్న కాలనీలో 14 మందిని హోం క్వారంటైన్‌ చేశామన్నారు.

కరోనా బాధితుడిని రానివ్వకుండా అడ్డగింపు..

చౌటుప్పల్‌ రూరల్‌ : కరోనా బాధితుడిని గ్రామానికి రానివ్వకుండా బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పీపల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. అయితే అతడికి కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించకపోవడంతో వైద్యులు అతడిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. దీంతో అతడు బుధవారం గ్రామానికి వస్తుండగా గ్రామస్తులు అడ్డుపడి ఊర్లోకి రావొద్దని రోడ్డుకు అడ్డంగా కట్టెలు, రాళ్లు పెట్టారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, మండల వైద్యసిబ్బంది అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించారు.

VIDEOS

logo