బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 01, 2020 , 23:46:00

పంచాయతీకో కమ్యూనిటీ టాయిలెట్‌

పంచాయతీకో కమ్యూనిటీ టాయిలెట్‌

  • స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మాణం 
  • ఒక్కోదాని నిర్మాణ వ్యయం రూ.2 లక్షలు 
  • కేంద్రం 60 శాతం, రాష్ట్రం 30శాతం, పంచాయతీ 10 శాతం వాటా 
  • గ్రామాల నుంచి ప్రతిపాదనలు కోరిన గ్రామీణాభివృద్ధి శాఖ 
  • జిల్లావ్యాప్తంగా 421 గ్రామ పంచాయతీలు 
భువనగిరి : స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ టాయిలెట్లు నిర్మించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రతి గ్రామపంచాయతీకో కమ్యూనిటీ టాయిలెట్‌ను నిర్మించాలని నిర్ణయించాయి. ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చే కూలీలతో పాటు, గ్రామంలోని అన్నివర్గాల వారు ఈ కమ్యూనిటీ టాయిలెట్లు వినియోగించుకునేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు పంపించాలని కోరింది. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చే గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాల్లో గ్రామసభల ద్వారా తీర్మాణాలు చేసుకుని సంబంధిత మండల అభివృద్ధి కార్యాలయాల ద్వారా జిల్లా శాఖకు పంపేలా మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. జిల్లాలో 421 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో చాలా గ్రామపంచాయతీల్లో టాయిలెట్లు లేవు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చే కూలీలు, పంచాయతీలకు వచ్చే ప్రజలు, సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోని పంచాయతీల్లో కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆదిశగా అడుగులు వేస్తున్నారు.
 ఒక్కో నిర్మాణానికి రూ. 2లక్షలు..
గ్రామాల్లో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో నిర్మించే కమ్యూనిటీ టాయిలెట్ల కోసం ఒక్కో టాయిలెట్‌కు రూ.2లక్షల చొప్పున ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  ప్రతి కమ్యూనిటీ టాయిలెట్‌ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, గ్రామ పంచాయతీ 10 శాతం చొప్పున డబ్బులు ఖర్చుచేయాల్సిఉంటుంది. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్యాణాలకు కావాల్సిన స్థలాన్ని గుర్తించడంతో పాటు, గ్రామసభ తీర్మానం కాపీలతో  గ్రామ పంచాయతీ వాటా ధనాన్ని కలెక్టర్‌, డీఆర్‌డీవోశాఖకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది.
మహిళలు, పురుషులకు వేర్వేరుగా ..
గ్రామాల్లో నిర్మించనున్న కమ్యూనిటీ టాయిలెట్లకు సంబంధించి మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు ప్రత్యేకమైన ప్లాన్‌ను సైతం అధికారులు రూపొందించారు. కమ్యూనిటీ టాయిలెట్లలో  మహిళలకు రెండు మరుగుదొడ్లు, పురుషులకు రెండు మరుగుదొడ్లతో పాటు రెండు మూత్రశాలలు కూడా నిర్మించనున్నారు. భువనగిరి : స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ టాయిలెట్లు నిర్మించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రతి గ్రామపంచాయతీకో కమ్యూనిటీ టాయిలెట్‌ను నిర్మించాలని నిర్ణయించాయి. ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చే కూలీలతో పాటు, గ్రామంలోని అన్నివర్గాల వారు ఈ కమ్యూనిటీ టాయిలెట్లు వినియోగించుకునేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు పంపించాలని కోరింది. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చే గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాల్లో గ్రామసభల ద్వారా తీర్మాణాలు చేసుకుని సంబంధిత మండల అభివృద్ధి కార్యాలయాల ద్వారా జిల్లా శాఖకు పంపేలా మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. జిల్లాలో 421 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో చాలా గ్రామపంచాయతీల్లో టాయిలెట్లు లేవు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చే కూలీలు, పంచాయతీలకు వచ్చే ప్రజలు, సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోని పంచాయతీల్లో కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆదిశగా అడుగులు వేస్తున్నారు.
 ఒక్కో నిర్మాణానికి రూ. 2లక్షలు..
గ్రామాల్లో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో నిర్మించే కమ్యూనిటీ టాయిలెట్ల కోసం ఒక్కో టాయిలెట్‌కు రూ.2లక్షల చొప్పున ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  ప్రతి కమ్యూనిటీ టాయిలెట్‌ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, గ్రామ పంచాయతీ 10 శాతం చొప్పున డబ్బులు ఖర్చుచేయాల్సిఉంటుంది. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్యాణాలకు కావాల్సిన స్థలాన్ని గుర్తించడంతో పాటు, గ్రామసభ తీర్మానం కాపీలతో  గ్రామ పంచాయతీ వాటా ధనాన్ని కలెక్టర్‌, డీఆర్‌డీవోశాఖకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది.
మహిళలు, పురుషులకు వేర్వేరుగా ..
గ్రామాల్లో నిర్మించనున్న కమ్యూనిటీ టాయిలెట్లకు సంబంధించి మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు ప్రత్యేకమైన ప్లాన్‌ను సైతం అధికారులు రూపొందించారు. కమ్యూనిటీ టాయిలెట్లలో  మహిళలకు రెండు మరుగుదొడ్లు, పురుషులకు రెండు మరుగుదొడ్లతో పాటు రెండు మూత్రశాలలు కూడా నిర్మించనున్నారు. 
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పంచాయతీకో కమ్యూనిటీ టాయిలెట్‌ నిర్మాణానికి  చర్యలు చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా 421గ్రామ పంచాయతీలు ఉండగా  అవసరం ఉన్న చోట కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు కోరాం.  కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, గ్రామపంచాయతీ 10 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణాల కోసం గ్రామపంచాయతీలు ప్రతిపాదనలు పంపాలి.
- ఉపేందర్‌రెడ్డి,డీఆర్‌డీఏ పీడీ

VIDEOS

logo