ఆదివారం 05 జూలై 2020
Yadadri - Jul 01, 2020 , 00:13:48

యాదాద్రీశుడి సన్నిధిలో పని చేయడం పుణ్య ఫలం

యాదాద్రీశుడి సన్నిధిలో పని చేయడం పుణ్య ఫలం

యాదాద్రి, నమస్తే తెలంగాణ : ఉద్యోగులు, అర్చకులు తమ జీవితాన్ని శ్రీ లక్ష్మీనరసింహుని సేవకు అంకితం చేసి పదవీ విరమణ పొందడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలమని, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపాలని కోరుకుంటున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో ఎన్‌.గీత అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పనిచేసిన తొమ్మిది మంది ఉద్యోగులు ఒకే రోజు పదవీ విరమణ పొందారు. దీంతో పదవీ విరమణ పొందిన ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, సహాయ పాచకుడు మధుసూదనాచార్యులు, మరింగంటి నర్సింహాచార్యులు, కామాటీలు పి.నర్సింహ, స్వీపర్‌ బి.మల్లయ్య, మైసయ్య, చిన్న స్వామి, ఈ.పోచయ్యను మంగళవారం ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి ఘనంగా సన్మానించారు. ఉద్యోగులు స్వామివారి సేవలో గడిపిన 35 ఏండ్లు ఎంతో విలువైనవిగా ఆమె అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు దోర్భల భాస్కరశర్మ, మేడి శివకుమార్‌, ఆలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గజవెల్లి రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

అటెండర్‌ బాలయ్య సేవలు మరువలేనివి..

ఆత్మకూరు(ఎం) : 14 సంవత్సరాల పాటు ఆత్మకూరు(ఎం) తహసీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన అటెండర్‌ బాలయ్య సేవలు మరువలేనివని తహసీల్దార్‌ పి.జ్యోతి అన్నారు. మంగళవారం మండలంలోని కప్రాయిపల్లి ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో బాలయ్య పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది.  కార్యక్రమంలో జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, ఎస్సై ఎండీ ఇద్రిస్‌ అలీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, సర్పంచులు రమేశ్‌గౌడ్‌, నగేశ్‌, ఆర్‌ఐ యాదగిరి, వివిధ పార్టీల నాయకులు, తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.logo