బుధవారం 27 జనవరి 2021
Yadadri - Jul 01, 2020 , 00:09:48

యాదాద్రి మోడల్ ఫారెస్ట్‌ అత్యద్భుతం

యాదాద్రి మోడల్ ఫారెస్ట్‌ అత్యద్భుతం

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచిన యాదాద్రి మోడల్‌ నేచురల్‌ ఫారెస్ట్‌ అత్యద్భుతమని ములుగు అటవీ కళాశాల, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. రెండేండ్లలో చిట్టడవిని తయారు చేయడం గొప్ప విషయమని కితాబిచ్చారు. లక్కారం యాదాద్రి మోడల్‌ నేచురల్‌ ఫారెస్ట్‌ను ములుగు అటవీ కళాశాల, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కళాశాల అధ్యాపక బృందం మంగళవారం సందర్శించింది. రెండేండ్లలో చిట్టడవిని ఎలా తయారు చేశారో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సర్వేశ్వర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్‌ మాట్లాడుతూ లక్కారం యాదాద్రి మోడల్‌ ఫారెస్ట్‌లో తక్కువ, మధ్యతరహా, ఎత్తైన మొక్కలను నాటారని తెలిపారు. అటవీ కళాశాల విద్యార్థులకు ఈ తరహా చిట్టడవుల పెంపకంపై అవగాహన కల్పిస్తామన్నారు. వారి వెంట ఫారెస్ట్‌ సిబ్బంది , ములుగు కళాశాల అధ్యాపక బృందం ఉన్నారు. 

  ఐదుదొనలతండాలో.. 

సంస్థాన్‌నారాయణపురం : మండల పరిధిలోని ఐదుదొనలతండాలో రాష్ట్ర అటవీశాఖ ఏర్పాటు చేసిన యాదాద్రి మోడల్‌ నేచురల్‌ ఫారెస్టును మంగళవారం ములుగు అటవీ కళాశాల ప్రొఫెసర్లు సందర్శించారు. 


logo