సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jun 30, 2020 , 23:58:49

మాదాపూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

మాదాపూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

తుర్కపల్లి : మండలంలోని మాదాపూర్‌లో మంగళవారం నుంచి 10 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ పది రోజులు వాణిజ్య, వ్యాపార సముదాయాలను సంపూర్ణంగా బంద్‌ చేసుకున్నారు. నిత్యావసరాల కోసం కిరాణషాపులు మధ్యాహ్నం 3 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. దవాఖానలు, మెడికల్‌ దుకాణాలకు అనుమతిచ్చారు.ఇదిలా ఉంటే మండల కేంద్రానికి చెందిన నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వారం రోజుల పాటు షాపులు తెరువొద్దని నిర్ణయించుకున్నారు. మరోవైపు బొమ్మలరామారం మండలం మైలారంలో మంగళవారం గ్రామస్తులు సమావేశమై వారం రోజుల పాటు ప్రజలందరూ హోంక్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. 

VIDEOS

logo