పల్లెకు గుబులు

- జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
- నిత్యం ఐదు నుంచి ఆరు వరకు నమోదు
- అనేక కుటుంబాలు హోంక్వారంటైన్లో..
- విస్తరిస్తున్న వైరస్‌తో ప్రజల్లో ఆందోళన
- పట్టణాలతోపాటు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్న పల్లెలు
జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. పట్టణాలే కాకుండా పల్లెల్లోనూ ప్రతాపం చూపిస్తున్నది. వలసొచ్చిన వారితోపాటు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే వారితో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగు లు, వ్యాపారులు, వృత్తి, ఉపాధి రీత్యా రాజధాని నుంచి జిల్లా కు రాకపోకలు సాగిస్తుండడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మాస్క్‌లు లేకుండా, భౌతికదూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతుండడంతో వైరస్ వ్యాప్తి సులువవుతోంది. దీని కట్టడి కోసం ఆయా మున్సిపాలిటీలు ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తుండగా, పల్లెల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో కొవిడ్ - 19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ఒక్క కేసు లేని జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 22కు చేరింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి, ఉపాధి రీత్యా హైదరాబాద్ నుంచి జిల్లాకు రాకపోకలు సాగిస్తుండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజల నిర్లక్ష్యం కూడా ఇందుకు కొంత కారణమవుతోంది. కరోనా ఉధృతి పెరిగి పరిస్థితి చేయి దాటుతుండడంతో వివిధ వర్గాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్నాయి. పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం స్వీయ కట్టడికి సిద్ధమయ్యారు.
పట్టణాలు దాటి పల్లెలకు..
వలస కూలీల ఆరంభం నేపథ్యంలో జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అనంతరం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించిన వారి నుంచి కరోనా వైరస్ పట్టణాలతో పాటు పల్లెలకూ పాకింది. అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే మండలంలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. మోత్కూరు మండలంలో 3, రామన్నపేట మండలంలో 4, భూదాన్ పోచంపల్లి మండలంలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భువనగిరి పట్టణంలో 5 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వలిగొండ మండలంలో 5 కేసులు, తుర్కపల్లి మండలంలో ఒకటి, బొమ్మలరామారం మండలంలో రెండు కేసులు నమోదయ్యాయి. ఆలేరు మండలం, ఆత్మకూరు(ఎం) మండలాల్లో 4 చొప్పున కేసులు రాగా, దూదివెంకటాపురంలో ఒకటి, యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు, యాదగిరిపల్లిలో ఒకరికి, రామాజీపేటలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది.
ఆదమరిస్తే ముప్పే...
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ సడలింపుతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. హోటళ్లు, కిరాణ దుకాణాలు, టీ కొట్లు, పలు వాణిజ్య దుకాణాలు తెరవడంతో.. వచ్చిపోయే వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలల్లోనూ రద్దీ కనిపిస్తోంది. మాస్కు లేకపోతే వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసినా చాలా మంది పెట్టుకోవడం లేదు. భౌతిక దూరంను సైతం విస్మరిస్తుండడంతో వైరస్ విస్తృతికి ఆస్కారం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తేల్చుకోవాల్సింది మనమేనంటూ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
- డీఎంఅండ్‌హెచ్‌వో సాంబశివరావు
కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దు. అత్యవసరమైతే మాస్కు తప్పనిసరిగా ధరించి భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్‌తో పాటు, నిత్యం సబ్బుతో చేతులను కడుక్కోవాలి. కరోనా లక్షణాలు ఉన్న వారు, వారితో కాంటాక్టులో ఉన్న వారు తప్పకుండా హోంక్వారంటైన్లోనే ఉండాలి. - భువనగిరి
తాజావార్తలు
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
- నెటిజన్లకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
- ప్రధాని పనికిరానివాడా.. కాదా అన్నది ప్రశ్న కాదు: రాహుల్‌గాంధీ
- ఒక్క కరోనా కేసు.. వారం రోజుల లాక్డౌన్
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం