శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 30, 2020 , 23:51:30

వ్యాపార రుణాలు విరివిగా ఇవ్వండి

వ్యాపార రుణాలు విరివిగా ఇవ్వండి

  • సెప్టెంబర్‌ వరకు ప్రక్రియ చేపట్టండి 
  • కొత్తగా పంట రుణాలు అందజేయాలి 
  • నల్లగొండ మహాజన సభలో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆదేశం

నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో వ్యాపార రుణాలు విరివిగా ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మహాజన సభలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు అన్ని బ్యాంకుల్లోనూ రుణ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన పంట రుణాలను రెన్యూవల్‌ చేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎంస్‌ చైర్మన్‌ వట్టె జానయ్య, సీఈవో మదన్‌ మోహన్‌, డీసీవో శ్రీనివాస మూర్తి, డైరెక్టర్లు నారాయణ రెడ్డి, సంపత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీసీఎంఎస్‌ బలోపేతానికి కృషి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న డీసీఎంఎస్‌ ఆస్తులు, వనరులు సద్వినియోగం చేసుకుని సంస్థను బలోపేతం చేస్తానని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్య అన్నారు. మంగళవారం స్థానిక డీసీఎంఎస్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, భువనగిరి, రామన్నపేట, దేవరకొండ ప్రాంతాల్లో ఉన్న గోడౌన్ల లీజులన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా ఎరువులు, విత్తనాలను డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో విక్రయిస్తామని, ఇందుకు అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో నారాయణ రెడ్డి, సైదులు, జయరాం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo