సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jun 30, 2020 , 03:04:13

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ముఖ్యమంత్రి కేసీఆర్‌  చిత్రపటానికి క్షీరాభిషేకం

తుర్కపల్లి : కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి మారుమూల గ్రామాలకు గోదావరి జలాలను తెచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని బొమ్మలరామారం ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. తిమ్మాపూర్‌ గూడెం బావి చెరువులోకి గోదావరి జలాలు వస్తున్నందున సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిల చిత్ర పటానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ గూదె బాల్‌నర్సయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పోలగోని వెంకటేశ్‌గౌడ్‌, రాజమల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo