మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jun 28, 2020 , 23:54:40

అపర మేధావి పీవీ నర్సింహారావు

అపర మేధావి పీవీ నర్సింహారావు

  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

 భువనగిరి : ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన అపర మేధావి, మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. పీవీ శతజయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు,

బహుభాషా కోవిదుడు, రచయిత, జర్నలిస్టుగా పీవీ చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు. ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందాయన్నారు. విద్యారంగంలో ఆయన ఎనలేని కృషి చేశారని, సర్వేల్‌లో మొదటి గురుకులాన్ని ప్రారంభించి గురుకులాల స్థాపనకు నాంది పలికారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo