యాదాద్రిలో నరసింహస్వామికి ఆరాధనలు

యాదాద్రి, నమస్తే తెలంగాణ: యాదాద్రిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. కొవిడ్-19 నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భౌతికదూరం పాటించాలని కోరుతూ దేవస్థానం మైక్ ద్వారా గంటకోసారి అనౌన్స్మెంట్ చేయిస్తున్నారు. ఆలయ ఈవో గీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రసాదం క్యూలైన్ల వద్ద భక్తులు భౌతికదూరం పాటించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవం కోసం ఆన్లైన్లో రుసుం చెల్లించిన భక్తుల గోత్రనామాలతో పూజలు చేశారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా శ్రీవారి కైంకర్యాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు.
రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
కొండపైన గల పర్వతవర్థిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ శివాలయం ప్రధానార్చకుడు గౌరీబట్ల నర్సింహరాములశర్మ ఆధ్వర్యంలోని అర్చకులు కుంకుమార్చన జరిపారు. ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు చింతపట్ల రంగాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడిశివకుమార్, సూపరింటెండెంట్లు వేముల వెంకటేశ్,ఎస్.వెంకటేశ్వర్రావు, సార నర్సింహ, బాలాజీ, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
- కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్రస్నానం
- భర్తపై కోపంతో.. అట్లకాడతో పిల్లలకు వాతలు