నేడు నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల్లో కేటీఆర్ పర్యటన

- నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పర్యటన
- మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పారంభోత్సవాలు
- హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరుచేసిన పనులకు శ్రీకారం
- నల్లగొండలో మొక్కలు నాటనున్న కేటీఆర్,జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ ప్రతినిధి - నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల్లో పర్యటించనున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మున్సిపాలిటీ కేంద్రాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనున్న కేటీఆర్ పర్యటన కోసం ఇరు జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక ఎమ్మెల్యేలు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కొవిడ్-19 విస్తరణ నేపథ్యంలో కేటీఆర్ పర్యటనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో మంత్రి కేటీఆర్ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు మినహా కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఎవ్వరూ రావద్దంటూ... ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం ఉదయం 10.30 గంట ల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వివిధ మున్సిపాలిటీల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన నల్లగొండ జిల్లా చిట్యాలకు చేరుకుంటారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే వైకుంఠదామం నిర్మాణానికి, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. చిట్యాల నుంచి నేరుగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు.
హుజూర్‌నగర్‌లో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి భారీ మెజార్టీతో ప్రజలు ఘన విజయం చేకూర్చారు. దీంతో ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు నేరుగా హుజూర్‌నగర్‌కు వచ్చా రు. ఆ సమయంలోనే హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానని సీఎం హామీ ఇచ్చారు. అక్కడికక్కడే పలు వరాలు ప్రకటించారు. అప్పుడు సీఎం ఇచ్చిన హామీ మేరకు హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఆ ప్రకారంగానే మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి హుజూర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం హుజూర్నగర్ ఉపఎన్నికల్లో విజయానంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మున్సిపాలిటీ కోసం మంజూరు చేసిన రూ. 25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పునాది రాయి వేస్తారు.
తర్వాత హుజూర్‌నగర్‌లోనే జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆపై నేరడుచర్ల మున్సిపాలిటీలో కేటీఆర్ పర్యటన కొనసాగనున్నది. నేరడుచర్ల మున్సిపాలిటీలోనూ ఉప ఎన్నికల అనంతరం సీఎం ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.15కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అక్కడే మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం ముగించుకుని నేరుగా నల్లగొండకు చేరుకుంటారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో మలశుద్ధి కేంద్రం(ఎఫ్ఎస్టీపీ) పనులను ప్రారంభిస్తారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) వద్ద హరితహారంలో భాగంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మొక్కలు నాటనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
తాజావార్తలు
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం