సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jun 29, 2020 , 00:16:14

కిడ్నీ రోగులకు ప్రభుత్వం భరోసా

కిడ్నీ రోగులకు ప్రభుత్వం భరోసా

  • ఆలేరులోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో డయాలసిస్‌  సెంటర్‌ ప్రారంభం
  • జిల్లాలోని 200 మందికి పైగా కిడ్నీ బాధితులకు వైద్యం 
  • విద్యుత్‌శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  • పీహెచ్‌సీలో రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు
  • సర్వరోగాలకు గాలి, కలుషిత నీరే కారణం  

కిడ్నీ రోగులకు ప్రభుత్వం భరోసాగా ఉంటుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.  “దురదృష్టవశాత్తు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు వారానికి ఒకసారి డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పొరపాటున వారం రోజులు దాటితే రోగుల ప్రాణాలు  ప్రమాదం”గా మారే అవకాశం ఉంటుందన్నారు. ఆదివారం ఆలేరులోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భగవాన్‌ మహావీర్‌ జైన్‌ ట్రస్టు, పలువురు దాతల సహకారంతో నిర్మించిన నూతన డయాలసిస్‌ సెంటర్‌ను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని 200 మందికి పైగా కిడ్నీ బాధితులకు సేవలు అందుతాయన్నారు. వేలకు వేలు ఖర్చు చేసి సమయం వృథా చేసుకుని డయాలసిస్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లే పరిస్థితులు  చూస్తున్నామన్నారు. తెలంగాణ  ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాగునీటిపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇందులో భాగంగా మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన జలాలు సరఫరా చేయిస్తున్నారని గుర్తుచేశారు.  సర్వరోగాలకు గాలి, కలుషిత నీరే కారణమన్నారు.                              -ఆలేరు 

ఆలేరు: “దురదృష్టవశాత్తు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు వారానికి ఒకసారి డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పొరపాటున వారం రోజులు దాటితే రోగుల ప్రాణాలు ప్రమాదం”గా మారే అవకాశం ఉంటుందని  విద్యుత్‌శాఖ మంత్రి  జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆలేరులోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భగవాన్‌ మహావీర్‌ జైన్‌ ట్రస్టు, పలువురు దాతల సహకారంతో నిర్మించిన నూతన డయాలసిస్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
జిల్లాలో 200 మందికి పైగా కిడ్నీ బాధితులకు సేవలు అందుతాయన్నారు. వేలకు వేలు ఖర్చు చేసి సమయం వృథా చేసుకుని డయాలసిస్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చే పరిస్థితులు చూస్తున్నామన్నారు. గతంలో లక్షల్లో ఒకరికి కిడ్నీ సంబంధిత రోగం వచ్చేదని, వైద్య కోసం ముంబై వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లాలో కిడ్నీ రోగులు పెరగటానికి నీటిలో ఫ్లోరోసిస్‌ ప్రభావమేనన్నారు. తెలంగాణ  ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ తాగునీటిపై ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు.
ఇందులో భాగంగా మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన  జలాలు సరఫరా చేయిస్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో మొక్కలు నాటారు. సర్వరోగాలకు కారణం గాలి కలుషిత నీరేనని మంత్రి అన్నా రు. అనంతరం పలువురు నాయకులు మం త్రి జగదీశ్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. 

కిడ్నీ రోగులకు ఉపశమనం  

ఆలేరు నియోజకవర్గంలోని కిడ్నీ రోగులకు సెంటర్‌ ఏర్పాటు వల్ల ఉపశమనం కలుగనుందని  ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. చాలా మందికి కిడ్నీలు సైతం దెబ్బతిన్నాయన్నారు.వారికి సకాలంలో డయాలసిస్‌ చేయించాలని సంకల్పించానని చెప్పారు. రెండు కిడ్నీలు పాడైపోయిన రోగులు వారానికి రెండు సార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తుందన్నారు. వీరు హైదరాబాద్‌కు వెళ్లి వేలు ఖర్చు చేసుకుని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
“నా చిన్నతనంలో మా తండ్రికి కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చింది. డయాలసిస్‌ చేయాలంటే ఎంతో శ్రమించే పరిస్థితి ఉండేది. అప్పట్లోనే ఉస్మానియా దవాఖానలో డయాలసిస్‌ వ్యాధిగ్రస్తుల్లో మా నాన్న రెండో వ్యక్తి, చాలా ఏండ్లుగా డయాలసిస్‌ చేయించుకుని చివరికి చనిపోయారని” అన్నారు. నా సొంత డబ్బు లు రూ. 5లక్షలతోపాటు ఇతర దాతల సహకారంతో డయాలసిస్‌ భవనాన్ని నిర్మించామన్నారు. భగవాన్‌ మహావీర్‌ జైన్‌ ట్రస్టువారిని సంప్రదించగా నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, భగవన్‌ మహావీర్‌ జైన్‌ ట్రస్టు సీఈవో ఇంద్రజిత్‌నీల్‌, దాత  జేఎస్‌ఆర్‌ గ్రూ ప్‌ ఎండీ  నారాయణగౌడ్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
ఆలేరుటౌన్‌: పిల్లలకు తండ్రి కానుకలు ఇస్తుంటారుకానీ బిడ్డగా ప్రభుత్వ విప్‌ తండ్రి పడ్డ బాధలు ఎవ్వరూ పడొద్దని డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఎందరికో అండగా నిలిచారని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆలేరులో డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి  ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో మొదటిసారి ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌ వల్ల ఈ ప్రాంతంలోని కిడ్నీ రోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.సెంటర్‌ ఏర్పాటుకు  సహాయ సహకారాలు అందజేసిన జైనులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  
ప్రభుత్వ విప్‌ చొరువతోనే..  
డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రభుత్వ విప్‌ చొరువతోనే సాధ్యమైందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. ఆలేరులో సెంటర్‌ ఏర్పాటు గురించి ప్రభుత్వ విప్‌ మొదటి సారిగా ప్రస్తావించినప్పుడు నిజంగా ఇది సాధ్యమేనా అనుకున్నా. మొదటగా ఎమ్మెల్యే  ఇచ్చిన రూ.4 లక్షలతోపాటు దాతల నిధులతో భవనం ఏర్పాటు జరిగిందన్నారు. భగవాన్‌ మహావీర్‌ ఫౌండేషన్‌ ట్రస్టు నిర్వాహకులు   పూర్తి సహాయ సహకారాలు అందించడం సంతోషకరమన్నారు.  

 ప్రభుత్వ విప్‌ పట్టుదలతోనే   సెంటర్‌ ఏర్పాటు 

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పట్టుదలతోనే ఆలేరులో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించామని  భగవాన్‌ మహావీర్‌ జైన్‌ ట్రస్టు ప్రతినిధి ఇంద్రజిత్‌జైన్‌ అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ కిడ్నీ రోగుల బాధల గురించి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంగా  సహకారం అందిస్తామని చెప్పామని, అందులో భాగంగానే మొదటిసారి గ్రామీణ ప్రాంతంలో సెంటర్‌ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నామన్నారు. 

ఆలేరులో ఏర్పాటు కావడం అదృష్టం 

ఆలేరులో ప్రతిష్ఠాత్మకమైన డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పా టు కావడం అదృష్టమని  మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య అన్నారు.కిడ్నీ రోగులు డయాలసిస్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

మంత్రికి  వినతిపత్రాలు అందజేత 

ఈ సందర్భంగా  ఆలేరు మున్సిపల్‌ పరిధిలో 2, 6వ వార్డుల్లో నూతన విద్యుత్‌లైన్లు వేయాలని, మున్సిపాలిటీలో ఆదనపు సిబ్బంది, పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని,  టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి అందజేయాలని  పలువురు విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ చింతికింది చంద్రకళ, ఎంపీపీ గంధమళ్ల అశోక్‌, జడ్పీటీసీ కుడుదుల నగేశ్‌, నార్ముల్‌ డైరెక్టర్‌ దొంతిరి సోమిరెడ్డి, ఎంపీడీవో హనమంతప్రసాద్‌,  తహసీల్దారు శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిగాడి మాధవి పాల్గొన్నారు. 

VIDEOS

logo