సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jun 28, 2020 , 02:09:20

హరితోద్యమం

హరితోద్యమం

పచ్చదనమే లక్ష్యంగా జరుగుతున్న ఆరోవిడుత హరితహారం జిల్లాలో మూడోరోజు శనివారం ఉత్సాహంగా కొనసాగింది. ఎమ్మెల్యే చిరుమర్తి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌లతోపాటు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. మూడురోజుల్లో కలిపి జిల్లావ్యాప్తంగా 2.89 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

భువనగిరి అర్బన్‌ : ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు తెలిపారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా శనివారం పట్టణంలోని 9, 10, 26 వార్డుల్లో ప్రజలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి పరిసరాలను ఆకుపచ్చగా మార్చుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, వార్డు సభ్యులు సుమ, ప్రమోద్‌కుమార్‌, నర్సింహ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo