పోచంపల్లిలో లాక్డౌన్

- తొలిరోజు మూతబడిన వ్యాపార, వాణిజ్య సంస్థలు
భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఇటీవల మండలంలోని జూలూరులో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పోచంపల్లి పురపాలికలో మూడు రోజులు లాక్డౌన్ విధిస్తున్నట్లు పాలకమండలి ప్రకటించింది. దీంతో మొదటి రోజు శుక్రవారం లాక్డౌన్ సంపూర్ణంగా కనిపించింది. కరోనా నేపథ్యంలో పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న ప్రజలు మున్సిపాలిటీ పిలుపునకు కట్టుబడి సంపూర్ణంగా లాక్డౌన్ అమలుకు సహకరించారు. పోచంపల్లి పట్టణంలోని దవాఖాన, మెడికల్ దుకాణాలు మినహా వ్యాపార వాణిజ్య, వైన్స్‌తో పాటు అన్ని దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేయించారు. మున్సిపల్ సిబ్బంది పట్టణంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు..
మండలంలోని జూలూరులో ఇటీవల ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో మండల వైద్యసిబ్బంది గ్రామంలోని వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అనంతరం గ్రామస్తులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. కరోనా సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న ఆరుగురు, సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్న 18 మందిని గుర్తించి హాంక్వారంటైన్ చేశారు. పోచంపల్లిలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడన్న అనుమానంతో అతనితో ప్రత్యక్షంగా కాంటాక్ట్ ఉన్న 18 మందిని బీబీనగర్ ఎయిమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి