శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Jun 25, 2020 , 23:37:45

ఉత్సాహంగా మొక్కలు నాటిన జనం..ఇంటింటికీ ఆరు మొక్కలు అందజేత

ఉత్సాహంగా మొక్కలు నాటిన జనం..ఇంటింటికీ ఆరు మొక్కలు అందజేత

  • గ్రామానికో చిట్టడవి తయారు కావాలి..ట్యాంకర్లతో మొక్కలను ఏపుగా పెంచాలి 
  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పిలుపు 
  • హరిత స్ఫూర్తి చాటిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నేతలు  

పల్లె, పట్నం కదిలింది.. పచ్చటి ఉద్యమం మొదలైంది.. ఊరూరా హరిత జాతర జరిగింది..ప్రకృతికి పచ్చలహారం తొడిగే మహోజ్వల ఘట్టం హరితహారం ఆరో విడుత గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. చిన్నాపెద్ద అంతా కలిసి పచ్చని ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తుర్కపల్లి మండలం బీల్యానాయక్‌ తండాలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి మొక్కలు నాటారు. భారీ ఎత్తున హాజరైన గ్రామస్తులు భౌతికదూరం పాటిస్తూ ఒకేసారి 2 వేల మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. ‘రెండేండ్ల కిందట హరితహారంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటగా పెరిగి పెద్దయి చిట్టడవి అయ్యింది. గ్రామానికో చిట్టడవిని ఏర్పాటు చేసేందుకు విరివిగా మొక్కలు నాటాలి’ అని ప్రభుత్వ విప్‌ సునీత పిలుపునిచ్చారు. 

-తుర్కపల్లి