కరోనా కల్లోలం

మోత్కూరు : మండల కేంద్రంలో కరోనా కల్లోలం చేస్తున్నది. పట్టణంలోని అంగడి బజారులో నివాసం ఉండే ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో ఈ నెల 21వ తేదీన గాంధీ దవాఖానకు తరలించారు. దీంతో వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బుధవారం పీహెచ్సీ వైద్యాధికారి ఆకవరం చైతన్యకుమార్ తెలిపారు. కరోనా బారిన పడిన వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడి వద్ద కొన్ని రోజులు ఉండి ఇటీవలే తన ఇంటికి వచ్చాడు. దీంతో అతడిని కలిసిన 33 మందిని గుర్తించి హోం క్వారంటైన్ చేశామని ఆయన తెలిపారు. అయితే అతనికి కరోనాతో పాటు షుగర్, బీపీ ఉండటంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని కింగ్ కోఠి దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
భయాందోళనలో ప్రజలు..
మోత్కూరులో ఓ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న ఓ వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో క్లినిక్‌లో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది, కంటి చికిత్స కోసం వచ్చిన 23 మందిని మండల వైద్యాధికారులు గుర్తించి హోం క్వారంటైన్ చేశారు. అయితే బుధవారం అంగడి బజారులో ఉండే వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో మండలకేంద్రంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భువనగిరిలో ఇద్దరికి..
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్ యజమాని తల్లిదండ్రులకు బుధవారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, సూపర్ మార్కెట్ నిర్వాహకులు 11 మంది, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న సిబ్బంది ఏడుగురు, రాజాపేటలోని తమ బంధువులను హోం క్వారంటైన్లో ఉండాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. 10 రోజుల కిందట ఉప్పల్‌లో జరిగిన ఓ శుభకార్యంలో భాగంగా ఎక్కువ సార్లు తమ బంధువులను కలువడంతో వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు తెలిపారు.
హోం క్వారంటైన్లో 304 మంది
భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 320 మందిని హోం క్వారంటైన్లో ఉంచినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాంబశివరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 16 మందికి పాజిటివ్ వచ్చిందని, 291 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని చెప్పారు. ప్రభుత్వ క్వారంటైన్లో ఎనిమిది మంది ఉన్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!