జిల్లాకు ఆరు రోడ్లు మంజూరు

- 31.15 కిలోమీటర్లకు రూ.17.32 కోట్లు మంజూరు
- కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి : ప్రధానమంత్రి గ్రామ సడక్యోజన పథకంలో భాగంగా జిల్లాకు ఆరు రోడ్లకు పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ అనితారామచంద్రన్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన మూడో విడుతలో రాష్ట్రంలో రూ.658.31 కోట్లతో 152 రోడ్ల నిర్మాణ పనులకు 1119.94 కిలోమీటర్ల మేర చేపట్టేందుకు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో రూ.17.32 కోట్లతో 31.15 కిలోమీటర్ల మేర మోత్కూరు, ఆలేరు, చౌటుప్పల్, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో ఆరు రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఆలేరు మండలం రాఘవాపురం నుంచి ఎర్రబెల్లితండా(బ్రాహ్మణపల్లి)వరకు 7.3 కిలోమీటర్లు, చౌటుప్పల్ మండలం పంతంగి నుంచి ఎస్ లింగోటం వరకు 5.3 కిలోమీటర్లు, చౌటుప్పల్ జాతీయ రహదారి నుంచి మల్లారెడ్డిగూడెం(వయా ఆరెగూడెం) పులాయిగూడెం నుంచి దత్తప్పగూడెం వరకు 4.3 కిలోమీటర్లు, పోచంపల్లి మండలం గౌస్‌కొండ నుంచి రెడ్డినగర్ (వయా శివారెడ్డిగూడెం) 4.6 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాలనాపరమైన అనుమతులు జారీ చేసిందని, ఈ పథకంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
తాజావార్తలు
- వివక్షకు తావులేదు: బైడెన్
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి