ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jun 21, 2020 , 23:13:38

కనువిందు చేసిన సూర్యగ్రహణం

కనువిందు చేసిన సూర్యగ్రహణం

భువనగిరి అర్బన్‌/ఆత్మకూరు(ఎం): కమ్ముకున్న మబ్బులలో సూర్యగ్రహణం ఛాయాచిత్రాలు కనువిందు చేశాయి. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం ఉదయం 10:21గంటలకు ఏర్పడిన సూర్యగ్రహణం మధ్యాహ్నం 1:45గంటలకు పూర్తవుతుందని అర్చకులు చెప్పడంతో పట్టణంలోని ఆలయాలను మూసివేశారు. సూర్యగ్రహణ ఛాయాచిత్రాలు భువనగిరి పట్టణంలో 10:25నుంచి 1:20గంటల వరకు కనిపించాయి. ఈ సమయంలో చిన్నారులు, పెద్దలు నల్లటి కండ్లద్దాలు పెట్టుకొని వీక్షించారు. 

మూఢనమ్మకాలను నమ్మొద్దు..

మోటకొండూర్‌ : సూర్యగ్రహణాన్ని మండల కేంద్రంలో అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు మైక్రోస్కోప్‌తో వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..గ్రహాలు, దోషాలకు సూర్యగ్రహణంతో ఎలాంటి సంబంధం ఉండదని, ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దని సూచించారు. గ్రహణం సమయంలో యువజన సంఘం నాయకులు ఆహార పదార్థాలు తీసుకున్నారు. మాజీ ఉపసర్పంచ్‌ నర్సింహ, అంబేద్కర్‌ సంఘం నాయకులు నవీన్‌, కిరణ్‌, పవన్‌కల్యాణ్‌, యువకులు నాగరాజు, గణేశ్‌, రమేశ్‌, మహేశ్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo