సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jun 18, 2020 , 01:11:07

శరవేగంగా కొండపై కొత్త క్యూలైన్‌ పనులు

శరవేగంగా కొండపై కొత్త క్యూలైన్‌ పనులు

యాదాద్రి,నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు కొవిడ్‌-19 వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు  చేపట్టిన కొత్త క్యూలైన్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో జరిగిన ఆలయాల ఈవోల సమావేశంలో భక్తులకు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని, కొవిడ్‌ ప్రభావం లేకుండా చూడాలని చేసిన సూచనల మేరకు ఇన్నాళ్లు ఉపయోగించిన క్యూలైన్‌ను తొలగించారు.

ఈ నెల 11న కొత్త క్యూలైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. గతంలో  పక్క పక్కనే బారికేడ్లు ఉండేవి. ఇప్పుడు ఒకే ఒక క్యూలైన్‌ ఉంటుంది. భక్తులు  దగ్గర దగ్గరగా నిలబడకుండా ఉండే విధంగా భౌతికదూరం పాటించేలా నిర్మాణం చేస్తున్నారు. ప్రధానాలయం లో దర్శనాల కోసం సత్యనారాయణస్వామి వ్రత మండపంపై నిర్మాణమవుతున్న క్యూలైన్‌ వరకు దీన్ని పొడిగించారు. అక్కడి నుంచి బాలాలయంలోకి వెళ్లే వరకు ఒకే లైన్‌ ఉండే లా నిర్మాణం చేస్తున్నారు. ప్రధానాలయంలో దర్శనాలు ప్రారంభమయ్యేవరకూ ఈ కొత్త క్యూలైన్‌లోనే దర్శనాలు కొనసాగనున్నాయి. 

VIDEOS

logo