శనివారం 06 మార్చి 2021
Yadadri - Jun 13, 2020 , 00:55:36

అభివృద్ధిలో అగ్రగామిగా..

అభివృద్ధిలో అగ్రగామిగా..

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి

కోదాడ /మునగాల : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సబ్బండ వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తూ రాష్ర్టాన్ని దేశ ముఖ చిత్రంలో అగ్రగామిగా నిలిపారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రం మునగాలలో 62 రెండు పడకల గృహల సమూదాయానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడలో మండల పరిషత్‌ నూతన కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం మునగాలకు చెందిన కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ షబ్బీర్‌, నర్సింహుల గూడెం ఎంపీటీసీ మదార్‌ బీ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్‌ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని కొనియాడారు. కరోనా మహమ్మారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పాటించాలన్నారు. అంతరాష్ట్ర రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.  రెండు రాష్ట్రాల నుంచి ప్రయాణం సులభవుతుందన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాను మంత్రి అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,ఎంపీపీలు చింతా కవితారెడ్డి, యాతాకుల జ్యోతి, ముప్పాని ఆశ, బిందు, జడ్పీటీసీలు మందలపు కృష్ణకుమారి, కొణతం ఉమ, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo