పాడి రైతుకు దన్ను

శ్వేత విప్లవం తెచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులు
l రైతుతోపాటు పాల వ్యాపారులకు అందజేత
l రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం
l నామమాత్రపు వడ్డీ వసూలు చేసేలా చర్యలు
l మూడు దశల్లో కార్డులివ్వాలని నిర్ణయం
l పాడి రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యం
l ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయనుంది. పాడి రైతులను ప్రోత్సహించి శ్వేత విప్లవం తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా రుణాలు మంజూరు చేయనున్నారు. పాడి రైతులతోపాటు పాల వ్యాపారులకూ రుణాలివ్వడం ఈ పథకం ఉద్దేశం. దీని విధి విధానాలు కేంద్ర మత్స్య,పశుసంవర్ధక, పాడి మంత్రిత్వశాఖ నుంచి జిల్లా యంత్రాంగానికి అందాయి. ఒక్కో రైతుకు రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నామమాత్రపు వడ్డీకి రుణమివ్వనున్నారు. ఈ పథకాన్ని మూడు విడుతల్లో అమలు చేయనున్నారు. మొదట ప్రభుత్వ డెయిరీల్లో సభ్యత్వమున్న రైతులకు, రెండో విడుత ప్రైవేటు డెయిరీ రైతులకు, మూడో విడుత ఇంటింటికి తిరుగుతూ పాలు అమ్మే వారికి కార్డులు అందజేయనున్నారు. జిల్లాలో మదర్ డెయిరీ, విజయ డెయిరీ రైతులు దాదాపు 21,930 మంది ఉండగా, ప్రైవేటు డెయిరీ, ఇల్లిల్లూ తిరుగుతూ పాలు పోసే వారు మరో పదివేల మందిపైనే ఉంటారు. కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం పాడి రైతులు తమ దరఖాస్తులను ఈనెల 20వతేదీలోపు ఆయా సొసైటీలలో, ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముకునే వారు, ప్రైవేటు డెయిరీల రైతులు పశుసంవర్ధకశాఖ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అందుకున్న రుణంతో పశువుల కొనుగోలుతోపాటు వాటికి కావాల్సిన గ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. -భువనగిరి
భువనగిరి : కరోనా నేపథ్యంలో ఆర్థికంగా కుంటుబడిపోయిన పాడి రైతులకు తోడ్పాటు అందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద జిల్లాలోని పాడి రైతులకు ఆర్థిక సహకారం అందించనున్నది. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి మంత్రిత్వ శాఖ నుంచి జిల్లా యంత్రాంగానికి అందా యి. ఇందుకు అవసరమైన ప్రణాళికలను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జూలై 31వ తేదీ లోగా జిల్లాలోని పాడి రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను అందించాలని నిర్ణయించారు. జిల్లాలోని 52,550 మంది పాడి రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధిచేకూరనున్నది. ఈ మేరకు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా పాడి రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారని వివరించారు.
రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం..
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పాడి రైతులు నేరుగా బ్యాంకు నుంచి రూ.లక్షా 60వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలోని మదర్ డెయిరీ, విజయ డెయిరీలకు చెందిన 21,930 మంది పాడి రైతులున్నారు. కాగా, వీరందరితోపాటు ప్రైవేటు డెయిరీలలో పాలు పోసే పాడి రైతులు, ఇండ్లల్లోకి తిరిగి పాలు అమ్ముకునే పాడి రైతులకు సైతం మొదటి, రెండవ, మూడవ విడుతల్లో కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలను అందించనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని 31,589మంది పాడి రైతులకు రుణ సౌకర్యాలు అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా బ్యాంకు ద్వారా నేరుగా రుణ సౌకర్యం పొందడంతోపాటు తక్కువ వడ్డీ సౌకర్యాన్ని సైతం ప్రభుత్వం ఈ పథకం ద్వారా కల్పించనున్నది.
దరఖాస్తు చేసుకోండిలా..
కేంద్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం, ఆర్థిక బలోపేతం లక్ష్యంగా చేపట్టిన కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి పాడి రైతులు ఈనెల 20వ తేదీ వరకు ఆయా సొసైటీలలో దరఖాస్తులు అందజేయాలి. ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముకునే పాడి రైతులు, ప్రైవేటు డెయిరీల పాడి రైతులు సంబంధిత పశుసంవర్ధక శాఖ కార్యాలయాల్లో సమర్పించాలి. దరఖాస్తుదారులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతోపాటు ఆధార్‌కార్డు జిరాక్స్‌పై సంతకం ఉండాలి. అదేవిధంగా నివాస ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌తో దరఖాస్తు ఫారాలను నింపి సొసైటీ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. సొసైటీల బాధ్యులు దరఖాస్తులను ఆయా పాల కేంద్రాల్లోని మేనేజర్లకు అందజేస్తారు. అక్కడ పరిశీలన పూర్తి చేసిన దరఖాస్తులను బ్యాంకులకు పంపిస్తారు. అనంతరం వారం పది రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేసేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించి పాడి రైతులు, పాల సొసైటీలు, బ్యాంకులను సమన్వయం చేస్తూ క్రెడిట్ కార్డులను అందించడంలో జిల్లా పశుసంవర్ధక శాఖ పర్యవేక్షించనున్నది.
పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని పాడి రైతులందరూ ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద జారీ చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి. గడువులోగా ఆయా సొసైటీల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పాడి రైతులు అందింపుచ్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి.
- డాక్టర్ వి.కృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
తాజావార్తలు
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు