గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 12, 2020 , 09:09:03

యాదాద్రిలో ప్రత్యేక పూజల కోలాహలం

యాదాద్రిలో ప్రత్యేక పూజల కోలాహలం

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిగాయి. కొండపైన గల పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. ప్రధానార్చకుడు  లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు చింతపట్ల రంగాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరిగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 1, 37, 105 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలతో రూ. 1, 26, 715, కొబ్బరికాయలు సమర్పించిన విభాగంతో రూ. 9,360, మినీ బస్‌తో రూ. 1, 030 ఆదాయం సమకూరినట్లు ఈఓ గీత తెలిపారు. 

చంటిబిడ్డలతో రాకండి : భక్తులు పదేళ్ల లోపు చిన్న పిల్లలతో యాదాద్రికి రావద్దని యాదాద్రి ఆలయ ఈఓ గీత కోరారు. కొంత మంది తల్లులు తమ చంటి బిడ్డలతో కొండపైకి చేరుకుంటున్నారని దర్శనానికి నిరాకరించడంతో వారు ఆవేదనతో తిరుగు ప్రయాణమవుతున్నారని చెప్పారు. కొండ కింద అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే భక్తులను కొండపైకి అనుమతిస్తున్నట్లు ఆమె వివరించారు. 


VIDEOS

logo