శనివారం 06 మార్చి 2021
Yadadri - Jun 10, 2020 , 23:39:46

యాదాద్రిలో నిత్య పూజలు

యాదాద్రిలో నిత్య పూజలు

యాదాద్రి, నమస్తే తెలంగాణ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య పూజల కోలాహలం నెలకొన్నది. బుధవారం వేకువజామునకే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతోపాటు అష్టోత్తర పూజలు, సాయంత్రం అలంకార జోడు సేవలు, మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పోలీసులు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించిన తర్వాతనే భక్తులను కొండపైకి అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ  బాలాలయంలో లఘు దర్శనాలు జరుగుతున్నాయి. ఆలయ ఈవో ఎన్‌.గీత, అనువంశిక ధర్మకర్త బీ.నర్సింహమూర్తి శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రధానార్చకులు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టర్‌ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని వేదపండితులు, అర్చకులు పూజా కైంకర్యాలు జరిపారు. ఏఈవో మేడి శివకుమార్‌, సూపరింటెండెంట్లు వేముల వెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రావు, సార నర్సింహ, బాలాజీ, కృష్ణయ్య తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. 

VIDEOS

logo