నియోజకవర్గంలో 699 చెరువులు నింపుతాం

- రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
- పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటాం..
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
ఆలేరుటౌన్: ముణ్నాలుగు నెలల్లో ఆలేరుకు గోదావరి జలాలు వస్తాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్మికులను కంటికి రెప్పలా చూసుకుంటానన్నారు. సోమవారం ఆలేరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సేఫ్టీకిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలేరు మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు కృషిచేస్తున్నారని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో ఆలేరును తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. కార్మికుల శ్రేయస్సే ముఖ్యమన్నారు. అనంతరం ఆరుగురికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. పట్టణ ప్రజలకు తడి, పొడిచెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతప్రసాద్, వైస్ చైర్పర్సన్ మొరిగాడి మాధవి, కౌన్సిలర్లు గుత్తా శమంతకరెడ్డి, జూకంటి శ్రీకాంత్, కందుల శ్రీకాంత్, బేతి రాములు, రాయపురం నర్సింహులు, మోర్తాల సునీత, దాసి నాగలక్ష్మి, చింతలఫణి సునీత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్, మదర్‌డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, మామిడాల భాను, గవ్వల నర్సింహులు, కె. ఆంజనేయులు, బైరి మహేందర్, కూళ్ల సిద్ధులు, కూతాటి అంజన్‌కుమార్, కొనపురం నాగరాజు, శివకుమార్, కొలనుపాక, రాఘవపురం సర్పంచులు లక్ష్మీప్రసాద్, బక్క రాంప్రసాద్ పాల్గొన్నారు
విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ఆలేరురూరల్: రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని కొల్లూరులో రూ.4.19 కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 నుంచి రైతుల కష్టాలు తెలుసుకొని రూ. 423 కోట్ల మంజూరు చేసి ఆదుకున్నారన్నారు. ఎకరానికి రూ. 5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు ఇస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించారని గుర్తుచేశారు. కాళేశ్వరం 15,16 ప్యాకేజీల ద్వారా త్వరలోనే ఆలేరు నియోజకవర్గంలోనే అన్ని చెరువులు నింపుతామన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచు కోటగిరి జయమ్మ, ఎంపీపీ గంధమల్ల అశోక్, వైస్ ఎంపీపీ గాజుల లావణ్య, ఉప సర్పంచు గ్యాదపాక మహేందర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాకి యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు జనగాం వెంకటపాపిరెడ్డి, శ్రీధర్, గ్యాదపాక నాగరాజు, ఆంజనేయులు, కిష్టయ్య, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు కృష్ణ, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు భానుచందర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!