బుధవారం 28 అక్టోబర్ 2020
Yadadri - Jun 04, 2020 , 23:48:12

యాదాద్రిలో శ్రీవారి నిత్యకల్యాణోత్సవం

యాదాద్రిలో శ్రీవారి నిత్యకల్యాణోత్సవం

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఏకాంత పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకం చేశారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ మంటపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్ర నామార్చన అనంతరం జోడు సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడి శివకుమార్‌, పర్యవేక్షకులు వేముల వెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రావు, నర్సింహ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


logo