ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 04, 2020 , 00:10:33

యాదాద్రిలో స్వాతి నక్షత్ర పూజలు

యాదాద్రిలో స్వాతి నక్షత్ర పూజలు

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఆలయంలో అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలలోకి ఆవాహనం చేసిన దేవతలు, మూలికలు, జలం, పంచామృతాలతో శ్రీవారికి అభిషేకం చేశారు. ఉదయం ప్రభాత సేవ వేళ వందలాది మంది భక్తులు భౌతిక దూరం పాటిస్తూ యాదాద్రి కొండ చుట్టూ గిరిప్రదక్షిణలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వేకువజామునకే స్వయంభూ, బాలాలయ కవచామూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మంటపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీ లక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తర పూజలు ఆన్‌లైన్‌లో భక్తుల కోసం నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఏఈవోలు శివకుమార్‌, భాస్కరశర్మ, రామ్మోహన్‌, చంద్రశేఖర్‌, పర్యవేక్షకులు వెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రావు, రాజన్‌బాబు, రమేశ్‌బాబు, రఘు ఉన్నారు.

VIDEOS

logo