సీజనల్ వ్యాధులపైఅప్రమత్తంగా ఉండాలి

- ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో వ్యాధుల నియంత్రణకు చర్యలు
- అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సత్ఫలితాలు
- ‘నమస్తే తెలంగాణ’తో కలెక్టర్ అనితారామచంద్రన్
“ఇప్పటికే రెండు విడుతలుగా పల్లె ప్రగతి, ఓ విడుత పట్టణ ప్రగతి చేపట్టాం. ప్రస్తుతం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఈనెల 1 నుంచి 8 వరకు పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మురుగు కాల్వలు శుభ్రం చేయడం. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడడం.. దోమల నివారణ, కలుషిత నీరు, హరితహారం తదితర అంశాలపై దృష్టి సారిం చాం. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి పారిశుధ్య కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని” కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలపై బుధవారం కలెక్టర్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
యాదాద్రి భువనగిరి, జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఇప్పటికే రెండు విడుతలుగా పల్లె ప్రగతి, ఓ దఫా పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాలు చేపట్టాం. ప్రస్తుతం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1 నుంచి 8 వరకు పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మురుగు కాల్వలు శుభ్రం చేయడం.. రోడ్లపై నీటి నిల్వలు ఉండకుండా చూడటం.. దోమల నివారణ, కలుషిత నీరు, హరితహారం తదితర అంశాలపై దృష్టి సారించాం. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి పారిశుధ్య కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అనితారామచంద్రన్ పేర్కొన్నారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ జరిపిన ఇంటర్వ్యూలో జిల్లాలో అమలు చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన పలు విషయాలను వివరించారు.
నమస్తేతెలంగాణ : జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం అమలు తీరు ఎలా ఉన్నది?
కలెక్టర్ : జిల్లా పరిధిలో 421 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈనెల 1 నుంచి 8 వరకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను చేపడుతున్నాం. గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల స్ఫూర్తితో ఈ స్పెషల్ డ్రైవ్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం.
నమస్తేతెలంగాణ : స్పెషల్ డ్రైవ్‌లో ఏయే కార్యక్రమాలు చేపడుతున్నారు?
కలెక్టర్ : ప్రధానంగా ఐదు అంశాలపైనే దృష్టి సారించాం. రోజువారీగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం. రానున్న రోజుల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని వారికి సూచిస్తున్నాం. మురుగు కాల్వలు శుభ్రపర్చడం, నీరు నిల్వ లేకుండా గుంతలను పూడ్చడం, ట్యాంకులను శుభ్రపర్చడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం.
నమస్తేతెలంగాణ : ప్రత్యేక నిధుల కేటాయింపులు ఏమైనా ఉన్నాయా?
కలెక్టర్ : ప్రతి గ్రామ పంచాయతీకి నెలనెలా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నది. జిల్లాలో ఉన్న 421 గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం నెలనెలా రూ.10 కోట్ల వరకు నిధులు వస్తున్నాయి. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల అమలుకు ఈ నిధులను వెచ్చించాలని సూచించాం. సర్పంచులు, కార్యదర్శులు భాగస్వాములై కార్యక్రమం విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు.
నమస్తేతెలంగాణ : మున్సిపాలిటీల్లో ఏయే కార్యక్రమాలు చేపడుతున్నారు?
కలెక్టర్ : పారిశుధ్య చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాల ను అమలు చేస్తున్నాం. ఖాళీ ప్లాట్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు కఠిన వైఖరిని అవలంభిస్తున్నాం. ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నాం.
నమస్తేతెలంగాణ : ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమ అమలుపై జిల్లా అధికారుల పర్యవేక్షణ ఎలా ఉన్నది?
కలెక్టర్ : నోడల్ ఆఫీసర్లు, మండల కో-ఆర్డినేటర్లు విజిలెన్స్ అధికారులు కార్యక్రమ అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాతో పాటు అదనపు కలెక్టర్లు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి కార్యక్రమ అమలు తీరును తెలుసుకోవడంతో పాటు సలహాలు సూచనలు ఇస్తున్నారు.
నమస్తే తెలంగాణ : క్షేత్ర స్థాయి పర్యటనలో ఇంకా ఏ అంశాలపై దృష్టి సారిస్తున్నారు?
కలెక్టర్ : జూన్ 20 నుంచి ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకనుగుణంగా జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ హరితహారంలో 33 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కార్యదర్శులను ఆదేశించాం. గతంలో మాదిరిగానే హరితహారం కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేస్తాం.
నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్ : జిల్లాలో మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆశ వర్కర్లతో పాటు రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బందితో పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లనే కరోనాను కట్టడి చేయగలిగాం. అయితే కొద్దిరోజులుగా అక్కడక్కడ మూడు, నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడంతో పాటు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
తాజావార్తలు
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!