శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - May 31, 2020 , 23:01:16

జిల్లా వ్యా ప్తంగా మోస్తరు వర్షం

జిల్లా వ్యా ప్తంగా మోస్తరు వర్షం

  • చల్లబడిన  వాతావరణం
  • మొగిలిపాకలో  ఈదురు  గాలులకు  ఎగిరిపడిన ఇంటిపైకప్పురేకులు

న్యూస్‌నెటవర్క్‌, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యా ప్తంగా ఆదివారం ఓ జిల్లా వ్యా ప్తంగా మోస్తరు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం కాస్త ఉపశమనం పొందారు. పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. చాలా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూదాన్‌పోచంపల్లి మండలం పరిధి కనుముక్కులలో కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం తడిసిపోయింది. వలిగొండ మండలం మొగిలిపాకలో మచ్చ సాలమ్మకు చెందిన ఇంటిపై రేకుల కప్పు లేచిపోయింది.

సాలమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ మొగిలిపాక శ్రీలతారమేశ్‌ కోరారు. పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. చెట్లు విరిగిపడ్డాయి. బీబీనగర్‌ మండలం రాఘవాపురంలో వర్షానికి తడిసిన ఓ ఇనుప స్తంభానికి బర్రె తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ట్రాన్స్‌కో అధికారులు ఆదుకోవాలని టీఆర్‌ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్‌ కోరారు. మోత్కూరు మండలంలో ఈదురు గాలి బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో ఇండ్ల రేకుల కప్పులు లేచిపోయాయి. యాదగిరిగుట్ట పట్టణం బీసీ కాలనీలో గౌరారం శేఖర్‌కు చెందిన ఇంటి రేకుల కప్పు కూలిపోయింది. ఇక రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 

VIDEOS

logo