ఆదివారం 05 జూలై 2020
Yadadri - May 31, 2020 , 22:57:44

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడమే లక్ష్యం

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడమే లక్ష్యం

చెరువులన్నీ నింపుతాం

 ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గంలోని అన్నీ చెరువులను నింపుతామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గొలు

సుకట్టు చెరువులను ఆధునీకరించి ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుతామన్నారు. చెరువుల మరమ్మతులకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయంలో కాల్వల ద్వారా చెరువులను నింపే విధానంపై ఇరిగేషన్‌శాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె  అధికారుల ప్రజంటేషన్‌ను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ బస్వాపూర్‌ ప్రధాన కాల్వపై నిర్మించే బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా యాదగిరిగుట్ట, మోటకొండూర్‌, ఆలేరు, ఆత్మకూరు(ఎం) మండలాలకు సాగునీరు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చెరువుకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కొండపోచమ్మ సాగర్‌ జలాశయానికి గోదావరి జలాలు వచ్చాయన్నారు. ఇక మిగిలింది బస్వాపూర్‌ జలాశయమేనని తెలిపారు. మరో నెలలోపు బస్వాపూర్‌కు సాగుజలాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేవారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆలేరుకు నీటిని మళ్లించే ప్రక్రియను వేగవంతం చేశామని స్పష్టం చేశారు. చాలామందిలో  కాల్వల ద్వారా చెరువులను ఎలా నింపుతారోనన్న అపోహ ఉందన్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చూసిన ప్రజాప్రతినిధులు చెరువుల నింపే విధానంపై ప్రజల సందేహాలను  తీర్చాలన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధ, సర్పంచులు కర్రె వెంకటయ్య, బైరగాని చిన్నపుల్లయ్య, ఎంపీటీసీలు చల్లూరి పోచయ్య, కాల్నె అయిలయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ మిట్ట వెంకటయ్య, నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, గడ్డమీది రవీందర్‌గౌడ్‌, కసావు శ్రీనివాస్‌, ఇరిగేషన్‌  ఏఈ అశోక్‌ ఆనంద్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ జంపాల సుమన్‌, మోటకొండూర్‌ మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్‌ భూమండ్ల అయిలయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, నాయకులు పైళ్ల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo