మంగళవారం 01 డిసెంబర్ 2020
Yadadri - May 30, 2020 , 23:41:56

రంగారెడ్డి జిల్లాలో 17 కరోనా పాజిటివ్‌

రంగారెడ్డి జిల్లాలో 17 కరోనా పాజిటివ్‌

  • సరూర్‌నగర్‌లోనే 14 కేసులు
  • యాచారం మండలం చౌదరిపల్లిలో 13 నెలల చిన్నారికి కరోనా
  • గ్రామాన్ని సందర్శించిన ఆర్డీవో, ఏసీపీ
  •  వికారాబాద్‌ జిల్లాలో ఒకరికి.. 
  • జాపాల, ధర్మసాగర్‌, తాండూరులో కోవిడ్‌ కలకలం 
  • కులకచర్లలో వైద్యుల పర్యవేక్షణలో ఎనిమిది కుటుంబాలు

   రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా శనివారం 17 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబాలలోనే  మరికొంతమందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. సరూర్‌నగర్‌లో 14 , యాచారం 1, మొయినాబాద్‌ 1, బాలాపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 243కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 9మంది మృతిచెందగా.. 111 మంది డిశ్చార్జి అయ్యారు. 120 మంది చికిత్స పొందుతున్నారు.