శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - May 30, 2020 , 23:16:57

యాదగిరిగుట్ట, మోటకొండూరులలో వాన

యాదగిరిగుట్ట, మోటకొండూరులలో వాన

  • భారీ శబ్దాలు, గాలులు, మెరుపులు 
  • భయాందోళనకు గురైన జనం 
  • పిడుగుపాటుకు బర్రె మృతి  

యాదగిరిగుట్ట, మోటకొండూర్‌ : యాదగిరిగుట్ట పట్టణం, మోటకొండూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలికి అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వర్షానికి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. 


పిడుగు పాటుతో బర్రె మృతి..

గుండాల: మండల పరిధిలోని వెల్మజాలలో పిడుగుపాటుకు రైతు సంగి అయిలయ్యకు చెందిన బర్రె మృతిచెందింది. బర్రె విలువ రూ.60 వేలు ఉంటుందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ సంగి బాలకృష్ణ, సింగిల్‌ విండో డైరెక్టర్‌ బాలకొమురయ్య కోరారు.

VIDEOS

logo