చెరువుల్లోకి గోదావరి జలాలు

యాదగిరిగుట్ట : కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీపై నిర్మితమవుతున్న బ్రాంచ్ కెనాల్ ద్వారా యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా ఉన్న 90 చెరువుల్లోకి గోదావరి జలాలు రానున్నాయని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. శుక్రవారం పలు గ్రామాల్లోని చెరువులను పరిశీలించారు. ఫీడర్ చానల్ కాల్వలు, గొలుసుకట్టు చెరువుల తీరుపై స్థానిక సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల చెరువుల తీరుపై నివేదికను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి సమర్పించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సాగునీరు అందించలేని కాంగ్రెస్ నాయకులు, తాజాగా ప్రాజెక్టులపై ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాలను ప్రారంభించారన్నారు. త్వరలో బస్వాపూర్ జలాశయంలోని 1.5 టీఎంసీ నీటిని విడుదల చేసి, అన్ని గ్రామాల చెరువుల్లోకి గోదావరి జలాలు రానున్నాయని చెప్పారు. రైతులకు నీళ్లందిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లినట్టేనని గుర్తు చేశారు. రైతులంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, దాతారుపల్లి సర్పంచ్ బైరగాని చిన్నపుల్లయ్యగౌడ్, జంగంపల్లి సర్పంచ్ గుండ్ల సరితామల్లారెడ్డి, రాళ్లజనగాం సర్పంచ్ శ్రీశైలం, ఎంపీటీసీ ఐలయ్య, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి శ్రీనివాస్, యువజన విభాగం నియోజకవర్గ సెక్రెటరీ జనరల్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారంలోని 86 చెరువులకు..
తుర్కపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బొమ్మలరామారం మండలంలోని 86 చెరువులకు త్వరలో గోదావరి జలాలు రానున్నాయని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలో వివిధ చెరువులకు ఏఏ ప్రాంతాల నుంచి గోదావరి జలాలు వస్తాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రధానంగా 3 కాల్వల ద్వారా 45 చెరువులు నింపడంతో పాటు మరో 41చెరువులను గొలుసుకట్టు కాల్వల ద్వారా నింపనున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు 3వేల ఎకరాల వరకు గోదావరి జలాలు అందనున్నాయన్నారు. జగదేవ్‌పూర్ చానల్ ద్వారా నాగాయపల్లి నుంచి తిమ్మాపూర్, ప్యారారం, సోమాజిపల్లి, సోలిపేట చెరువులను నింపడంతో పాటు తుర్కపల్లి మండలంలోని మరో లింక్ ద్వారా కంచల్‌తండా, చీకటిమామిడి, నాయకునితండా, మాచన్‌పల్లి, చౌదర్పల్లి, మర్యాల, పిల్లిగుండ్లతండా నింపనున్నట్టు తెలిపారు. మరో కాల్వ ద్వారా రామ్లింగంపల్లి, తూముకుంటా, జలాల్పూర్, రంగాపూర్, బొమ్మలరామారం, మల్యాల, ఖాజీపూర్, మైలారం, నాగినేనిపల్లి, మేడిపల్లి గ్రామాల్లో చెరువులను నింపనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పల్లవిరెడ్డి, నరేందర్‌రెడ్డి, రవికాంత్, మండల ప్రత్యేక అధికారి జ్యోతికుమార్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆర్ఆర్ఆర్ టీంతో కలవనున్న అలియా.. !
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు చిరంజీవి కన్నుమూత
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం