శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - May 28, 2020 , 23:15:11

మదర్‌ డెయిరీలోనే పాలు పోయండి

మదర్‌ డెయిరీలోనే పాలు పోయండి

  •  ప్రైవేటు డెయిరీలను నమ్మకండి 
  • ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి..  
  • పాడి రుణాలను రైతులు వినియోగించుకోవాలి 
  • డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయండి
  • కొండపోచమ్మ సాగర్‌తో పుష్కలంగా నీళ్లు 
  • టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి  

మోటకొండూర్‌: పాడి రైతులు మదర్‌ డెయిరీలో పాలు విక్రయించి లాభం పొందాలని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం పాడిరైతులకు అందిస్తున్న రుణాలను వినియోగించుకోవాలన్నారు. మండల కేంద్రంలోని పాల కేంద్రంలో గురువారం పాల సంఘం చైర్మన్‌ సిద్ధులు ఆధ్వర్యంలో పాడి రైతులకు ఆయన బోనస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘంలో సంవత్సరానికి వచ్చిన ఆదాయంతో లీటర్‌ పాలపై 60 పైసల బోనస్‌ను 120 మందికి మొత్తం రూ.లక్షా 50వేలు అందించడంపై పాల సంఘం చైర్మన్‌ సిద్ధులును అభినందించారు. పాల సంఘం సొసైటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. నియంత్రిత సాగు విధానంపై రైతులు దృష్టి సారించాలన్నారు. రైతు తాను పండించిన పంటకు తానే ధరను నిర్ణయించే స్థాయికి రావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. త్వరలోనే సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి సోన విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన రైతుబంధు వేదికల నిర్మాణానికి  దాతలు సహకరించాలని కోరారు. 

గ్రామాభివృద్ధికి సహకరిస్తా..

మోటకొండూర్‌ గ్రామాభివృద్ధికి సహకరించాలని స్థానిక సర్పంచ్‌ వడ్డెబోయిన శ్రీలత డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిని కోరారు. స్పందించిన ఆయన గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మండలంలో ఉపాధిహామీ పథకానికి  రూ.20లక్షలు కేటాయించారన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకురాలు నాగమణి తయారు చేసిన మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి,  మదర్‌ డెయిరీ డైరెక్టర్లు శ్రీశైలం, శ్రీకర్‌రెడ్డి, ఎంపీటీసీ అంజిరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు బురాన్‌, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ ఐలయ్య, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, పాల సంఘం డైరెక్టర్లు మల్లేశ్‌మిత్ర, శ్రీశైలం, వీరమల్లేశ్‌, భిక్షపతి, వంగపల్లి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎగ్గిడి బాలయ్య పాల్గొన్నారు. 

VIDEOS

logo