గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - May 28, 2020 , 00:02:35

రోటరీక్లబ్‌ సేవలుఅమోఘం

రోటరీక్లబ్‌ సేవలుఅమోఘం

  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆలేరుటౌన్‌ :  రోటరీక్లబ్‌ సేవలు అమోఘమని ప్రభుత్వవిప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. రోటరీక్లబ్‌ అమీర్‌పేట ప్రతినిధులు బహూకరించిన రూ.1.70,000 విలువైన రెండు ఫ్రీజర్లను ఆమె బుధవారం ఆలేరు సీహెచ్‌సీ మార్చురీకి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ 20 ఏండ్లుగా ఆలేరుకు రోటరీ క్లబ్‌ సేవలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 32 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం తన విజ్ఞప్తి మేరకు రెండు ఫ్రీజర్లు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీక్లబ్‌ సభ్యుడు ఎస్‌.వెంకటేశ్వర్‌రావు తన పుట్టినరోజు సందర్భంగా 7500 మాస్కులు అందజేశారు. అనంతరం ప్రభుత్వవిప్‌, రోటరీ క్లబ్‌ సభ్యులు మన్మోహన్‌గుప్తా, వెంకటేశ్వర్‌రావు, విజయ్‌భాస్కర్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రమేశ్‌, డీఎంహెచ్‌వో సాంబశివరావు, డీసీహెచ్‌వో రవిప్రకాశ్‌, ఎంపీడీవో హనమంతప్ప, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, సీహెచ్‌సీ డాక్టర్లు దినేశ్‌, శ్రీనివాస్‌, దుర్గ పాల్గొన్నారు. 


VIDEOS

logo