699 చెరువులను నింపుతాం..

- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట :ఆలేరుకు అవసరమయ్యే సాగునీటి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. చెరువులను నింపేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. యాసంగి వరకు ఆలేరు నియోజకవర్గంలోని 699 చెరువులను కాళేశ్వరం జలాలతో నింపుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి చెరువును నింపాలని ఇరిగేషన్‌శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ ప్రధాన కాల్వపై నిర్మించే బ్రాంచ్ కెనాళ్లతో యాదగిరిగుట్ట, మోటకొండూర్, ఆలేరు, ఆత్మకూరు(ఎం), కాళేశ్వరం 14వ ప్యాకేజీ కొండపోచమ్మ ప్రాజెక్ట్ నుంచి శామీర్‌పేట వాగు ద్వారా బొమ్మలరామారం, తుర్కపల్లి, మల్లన్నసాగర్ జలాశయం డిస్ట్రిబ్యూటరీ కాల్వ ద్వారా రాజాపేట మండలాల చెరువుల్లోకి సాగునీరు రానున్నది. నవాబ్‌పేట జలాశయం ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందుతుంది. మరో 7 నెలల్లో ఆలేరు నియోజకవర్గంలోని 53,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వాగుల్లో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాం. మరిన్ని చెక్‌డ్యాంలు నిర్మించాల్సి ఉంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించాం. సర్పంచులకు చెరువులను పరిశీలించాలని సూచించాం. ఇప్పటికే మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు వచ్చాయి. కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్
- సంత్ సేవాలాల్ మహరాజ్ నిజమైన సేవకుడు
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?
- పాఠశాలలో మరిన్ని వసతులు కల్పిస్తాం : మంత్రి కొప్పుల
- మళ్లీ పెరిగిన పసిడి ధర