ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - May 27, 2020 , 03:49:45

రైతులకు అవగాహన పెంచండి :కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

రైతులకు అవగాహన పెంచండి :కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

 భువనగిరి : నియంత్రిత పద్ధతిలో సాగు చేపట్టేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. ఆమె మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో కలెక్టరేట్‌ నుంచి మంగళవారం  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించే పంటలు వేసుకునేలా రైతాంగాన్ని సంఘటితపర్చాలని సూచించారు. జిల్లాలో విభిన్న పంటలు సాగు చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు. మద్దతు ధర లేని పంటలు వేసుకొని నష్టపోకుండా చూడాలన్నారు. జిల్లాలో వానకాలానికి రూపొందించిన 1,30,455 ఎకరాల వరి సాగు విస్తీర్ణానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను మండలాలు, గ్రామాల వారీగా రూపొందించుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రమేశ్‌, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పాల్గొన్నారు. 

VIDEOS

logo