శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - May 25, 2020 , 01:37:11

యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు

యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి నిత్యపూజలను శాస్ర్తోక్తంగా జరిపారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవలు నిర్వహించి స్వామివారికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి, శ్రీ లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి, శ్రీసుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమంటపంలో ఊరేగించారు. శ్రీ లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. సాయంత్రం అలంకారజోడు సేవలు, మంటపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఆరగింపు తదుపరి పవళింపు సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు.

VIDEOS

logo