జూన్ 18లోగా పనులు పూర్తిచేయాలి

- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
- ఆలేరులోని డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణ పనుల పరిశీలన
- మొక్కలు నాటి పరిసరాలను శుభ్రం చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం
ఆలేరు టౌన్ : జూన్ 18లోగా డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం సమీపంలో దాతలు అందజేసిన రూ.22 లక్షలతో నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణ పనులను ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మహావీర్ ఫౌండేషన్ ప్రతినిధులు సురేందర్ చాంద్ జైన్, గౌతంజైన్లు ప్రభుత్వవిప్‌తో మాట్లాడుతూ తక్కువ సమయంలో భవన నిర్మాణ పనులు పూర్తి చేయడం చాలా సంతోషమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సెంటర్లో రోగులకు బోరు వాటర్ తప్పనిసరి అని, దీనికి తోడు మిషన్ భగీరథ నీరు అందుబాటులో ఉండాలని, పదివేల లీటర్ల ట్యాంకు ఏర్పాటు చేయాలని, సివిల్ పనులు త్వరగా పూర్తి చేయాలని విప్‌కు విన్నవించారు. ప్రభుత్వవిప్ విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ మహావీర్ భగవాన్ జైన్ డయాలసిస్ సెంటర్ ఆధ్వర్యంలో సెంటర్లో 6 బెడ్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా నెలలో 30 మందికి డయాలసిస్ చేయవచ్చునని, భవిష్యత్తులో మరో 12 బెడ్ల వరకు ఏర్పాటుకు మహవీర్ యజమాన్యం తోడ్పాడు అందించనున్నదని తెలిపారు.
జూన్ 18న ప్రారంభంలోపు అన్ని పనులు పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి గారిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. డయాలసిస్ భవనంలో సివిల్, ఎలక్ట్రికల్, శానిటేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని, ఏసీలను ఏర్పాటు చేయాలన్నారు. సెంటర్ చుట్ట్టుపక్కల పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని కాంట్రాక్టర్ నరేందర్‌రెడ్డిని ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ విప్ సమీపంలో ఉన్న పోస్ట్‌మార్టం గదిని పరిశీలించారు. శవాలను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీజర్ చెడిపోయినందున, రోటరీ క్లబ్ అమీర్‌పేట అందజేసిన రెండు ఫ్రీజర్లను ఈ నెల 27న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్ అందజేస్తారన్నారు. ఈ నెల 1వ తేదీలోగా సెంటర్ చుట్టూ చెత్తను పూర్తిగా తొలగించాలని, మొక్కలు నాటాలని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశం, జిల్లా గ్రంథాలయం సభ్యుడు బాలస్వామి, సీహెచ్‌సీ డాక్టర్ ప్రసాద్, ఎస్సై రమేశ్, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మొరిగాడి వెంకటేశ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పొరెడ్డి శ్రీనివాస్, కౌన్సిలర్లు బేతి రాములు, జూకంటి శ్రీకాంత్, కందుల శ్రీకాంత్, నర్సింహులు, దయామణి, సునీత, దాసి నాగలక్ష్మి, నాయకులు నాగరాజు, గిరిరాజు వెంకటయ్య, మొరిగాడి ఇందిర, పిక్క శ్రీను, మధు, సంపత్, కూతాటి అంజన్‌కుమార్, కూళ్ల సిద్ధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో