మంగళవారం 26 మే 2020
Yadadri - May 24, 2020 , 01:19:57

మాస్కులు లేకుండా బయటకు రాకండి

మాస్కులు లేకుండా బయటకు రాకండి

  •  ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

యాదగిరిగుట్ట: మాస్కులు లేకుండా బయటకు రావద్దని  ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నారు. శనివారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో 63 మందికి, గౌరాయిపల్లిలో 9మందికి,  ధర్మారెడ్డిగూడెంలో 10 మందికి, కాచారంలో 10 మందికి, పెద్దకందుకూరులో 14 మందికి, చిన్నకందుకూరులో ఇద్దరు, వంగపల్లిలో 36 మందికి, చొల్లేరు, మహబూబ్‌పేటలో నలుగురు ముస్లింలకు రంజాన్‌ పండుగకు కావాల్సిన సరుకుల కిట్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో సుమారు 2500 మంది ముస్లింలకు రంజాన్‌ కిట్లు అందజేశామన్నారు.

  దేశంలో ఎక్కడాలేని విధంగా కరోనా బాధితులను సీఎం కేసీఆర్‌ గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్నారని తెలిపారు.   అనంతరం మాసాయిపేటతోపాటు పలు గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే పారిశుధ్య సిబ్బందిని  సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధ, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మాసాయిపేట సర్పంచ్‌ వంటేరు సువర్ణ, చొల్లేరు సర్పంచ్‌ తోటకూరి బీరయ్య, మహబూబ్‌పేట సర్పంచ్‌ ఆరె స్వరూప, గౌరాయిపల్లి సర్పంచ్‌ సత్యనారాయణ, వంగపల్లి ఉప సర్పంచ్‌ రేపాక స్వామి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు వంటేరు సురేశ్‌రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ ఇన్‌చార్జి గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ శ్రీశైలం, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్‌  వెంకటయ్య  పాల్గొన్నారు.  logo