మంగళవారం 26 మే 2020
Yadadri - May 23, 2020 , 01:29:37

టీఆర్‌ఎస్‌తోనే నియోజకవర్గ అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే నియోజకవర్గ అభివృద్ధి

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి : టీఆర్‌ఎస్‌తోనే భువనగిరి నియోజకవర్గ  అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పైళ్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని తాజ్‌పూర్‌, అనాజీపురం. నమాత్‌పల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో  ముస్లింలకు రంజాన్‌ కానుకలను ఆయన అందజేసి మాట్లాడారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్‌ను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. భువనగిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ముస్లిం కుటుంబాలకు  సొంత నిధులతో పైళ్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బియ్యంతో పాటు 16రకాల వస్తువులతో కూడిన కిట్టును అందజేస్తున్నట్లు తెలిపారు. రంజాన్‌ పవిత్ర మాసంలో జరుపుకునే ప్రత్యేక ప్రార్థనలు ఇండ్లల్లోనే జరుపుకుంటుండటం సంతోషకరమన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జనగాం పాండు అధ్యక్షతన జరిగిన ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కొలను లావణ్య, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌గౌడ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు  ఎడ్ల రాజిరెడ్డి,  పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్‌,  టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు  రావి సురేందర్‌రెడ్డి, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జిట్టా లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.  

రంజాన్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

భువనగిరి అర్బన్‌: రంజాన్‌ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 2, 5వ వార్డుల్లోని ముస్లింలకు శుక్రవారం ఎమ్మెల్యే  సొంత నిధులతో నిత్యావసర సరుకు లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్మన్‌  ఆంజనేయులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, నాయకులు గోమారి సుధాకర్‌రెడ్డి, ఏవీ.కిరణ్‌కుమార్‌, చెన్న మహేశ్‌, గాదె శ్రీనివాస్‌, జనగాం పాండు, ఒరుగంటి గోపాల్‌ పాల్గొన్నారు.  


logo