ప్రాణాలు తీసిన అతివేగం

ఆగివున్న లారీలను ఢీకొట్టిన కారు
ముగ్గురు దుర్మరణం, ఇద్దరికి గాయాలు
చిట్యాల : అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దయ్యాల వీరరాజు హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. తమ స్వగ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో అతని పెద్ద కుమారుడు రాంబాబు తన కారులో తల్లి లక్ష్మితో కలిసి వెళ్లాడు. బుధవారం రాత్రి 9 గంటలకు కారులో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. కారులో లక్ష్మి మనుమడు, మనుమరాలితోపాటు హైదరాబాద్‌లోనే వాచ్‌మన్‌గా పని చేస్తున్న అదే గ్రామానికి చెందిన గీసాల శ్రీనివాస్(48) అతడి భార్య లక్ష్మి(40), ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న గొర్రుపూడి గ్రామానికి చెందిన కండవెళ్లి లక్ష్మీచందన(18), ఆమె తమ్ముడు వీరబాబు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులోని రైస్‌మిల్లు వద్ద ధాన్యం అన్లోడ్కోసం వరుసగా నిలిపి ఉన్న రెండు లారీలను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అతడి భార్య లక్ష్మి, కండవెళ్లి లక్ష్మీచందన అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ రాంబాబుతోపాటు అతని తల్లి దయ్యాల లక్ష్మికి గాయాలయ్యాయి. మిగితా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
తాజావార్తలు
- ఆ రాష్ట్రాల నుంచి వస్తే నెగెటివ్ సర్టిఫికెట్ ఇవ్వాలి : సీఎం
- భూ తగాదాలు.. అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
- గొర్రెలకు హాస్టళ్లు.. ఎక్కడో తెలుసా?
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు