గురువారం 09 జూలై 2020
Yadadri - May 20, 2020 , 01:15:30

పల్లెర్లలో ఎవరికీ కరోనా లేదు

పల్లెర్లలో ఎవరికీ కరోనా లేదు

భయాందోళన చెందొద్దు 

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

ఆత్మకూరు(ఎం) : పల్లెర్లతో పాటు ఆత్మకూరు మండలంలోని ఏ గ్రామంలో ఎవరికీ కరోనా సోకలేదని.. ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పల్లెర్లలో హోం క్వారంటైన్‌లో ఉన్న 14 కుటుంబాలకు చెందిన రేషన్‌కార్డు లేని 22 మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. భౌతికదూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పేదలకు టీఆర్‌ఎస్‌ నేతలు అండగా నిలువడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్యోతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, సర్పంచ్‌ నాయిని నర్సింహారెడ్డి, ఏఎస్సై ఎండీ ఇద్రిస్‌అలీ, ఆర్‌ఐ యాదగిరి, ఆత్మకూరు(ఎం) ఎంపీటీసీ యాస కవిత, వీఆర్వో రాంచందర్‌ పాల్గొన్నారు.

 సీఎం హామీతోనే ఆలేరుకు గోదావరి నీళ్లు.. 

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు త్వరలో రానున్నాయని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. పల్లెర్లలో విలేకరులతో ఆమె మాట్లాడారు. గంధమల్ల రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని చెరువులను గోదావరి జలాలతో నింపడంతో పాటు ఆలేరు పెద్దవాగు నుంచి బిక్కేరు వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంల్లోకి గోదావరి జలాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషనల్‌ సెక్రటరీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని ప్రభుత్వ విప్‌ తెలిపారు. అదేవిధంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి పిల్ల కాల్వల ద్వారా ఆత్మకూరు(ఎం) మండలానికి సాగునీరు అందిస్తామన్నారు. ఎన్నికల హామీ మేరకు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. 


logo