మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

నియోజకవర్గ ప్రజల అభ్యున్నతే లక్ష్యం
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
భువనగిరి : మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణం రాయగిరి సోమారాధాకృష్ణ ఫంక్షన్హాల్లో పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35వార్డుల ముస్లింలకు మంగళవారం రంజాన్ కిట్లను అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముస్లిం కుటుంబాలకు తన సొంత నిధులతో పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యంతో పాటు 16రకాల వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నామన్నారు. ప్రతి ముస్లిం కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రంజాన్ పవిత్ర మాసంలో జరుపుకొనే ప్రత్యేక ప్రార్థనలు ఇండ్లల్లోనే నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను పాటించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్యాదేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, ఎడ్ల రాజేందర్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కల చిరంజీవియాదవ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం