గురువారం 09 జూలై 2020
Yadadri - May 20, 2020 , 01:07:24

యాదాద్రికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా

యాదాద్రికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ఉంటుందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాల వద్ద 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను  ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారంలో ఉంటుందని ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలకు సీఎం కేసీఆర్‌ చేతలతో బుద్ధిచెప్పారన్నారు. 24 గంటల పాటు  రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్నందున విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు, కాటేజీలు, ప్రెసిడెన్షియల్‌ సూట్లు, పెద్దగుట్టలో టెంపుల్‌ సిటీ పనులు జరుగుతుండటంతో అందుకు అనుగుణంగానే విద్యుత్‌ సరఫరా  ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎరుకల సుధా, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కాటబత్తిని ఆంజనేయులు, మున్సిపల్‌ కమిషనర్‌ జంపాల రజిత, డీఈ కృష్ణ, డీఈటీ శ్రీనివాస్‌, ఏడీఈ శ్రీనివాసులు, ఏఈ సాయిదీప్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, సురేందర్‌, ఆవుల మమత, టీఆర్‌ఎస్‌ నాయకులు మిట్ట వెంకటయ్య, అంకం నర్సింహ, శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 


logo